రచ్చకెక్కిన గొడవ, శైలజానాథ్‌పై జెసి ప్రభాకర్ రెడ్డి ఫైర్

జిల్లాలో పార్టీ పతనానికి కారణం ఎవరో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తాను వివరిస్తానని ఆయన చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రఘువీరా రెడ్డి జెసిబి నడిపారని ఆయన విమర్శించారు. సుబ్బరాయ సాగర్ నీటి విడుదల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు ముదిరిన విషయం తెలిసిందే. సుబ్బరాయసాగర్ నుంచి తాడిపత్రి కాలువకు నీటి విడుదలను అడ్డుకోవడానికి శైలజానాథ్ ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి. అయితే, తాడిపత్రి కాలువకు నీటిని విడుదల చేయించడంలో జెసి దివాకర్ రెడ్డి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications