Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

థానే తుఫానుకు 35 మంది బలి, రంగంలోకి ప్రభుత్వం

Thane Cyclone
హైదరాబాద్: థానే తుఫానుకు 35 మందిని బలి తీసుకుంది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో తుఫాను బీభత్సం సృష్టించింది. 21 మందిని గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఐదు వేలకుపైగా ఇళ్లను నేలమట్టమైనట్లు అంచనా. మూడు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. కడలూరు, పుదుచ్చేరి జిల్లాల ప్రజలకు కాళరాత్రే అయింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లను వణికించిన ఈ తుఫాను ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 6.30-7.30 గంటల మధ్య పుదుచ్చేరికి ఆగ్నేయ దిశలో తీరం దాటినట్టు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది.

తీవ్ర పెను తుఫానుగా తీరం దాటిన 'థానే'.. 11.30 గంటలకు తీవ్ర వాయు గుండంగా మారింది. ఇది క్రమేపీ బలహీనపడుతుందని తెలిపింది. థానే కారణంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, పుదుక్కోట్టై, నాగపట్నం, తంజావూరు, పుదుచ్చేరిలతోపాటు రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో 35 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కడలూరులోనే 21 మంది మరణించారు. చేపల వేటకు వెళ్లిన 21 మంది జాలర్లు గల్లంతయ్యారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం జయలలిత రూ.2 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.

థానే ఉద్ధృతి, ఈదురు గాలులకు సుమారు 2 లక్షల వృక్షాలు నేలకూలాయి. ఐదు వేలకుపైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. వెయ్యి పడవలు ధ్వంసమయ్యాయి. కన్యాకుమారి, కడలూరు, నాగపట్నం తదితర ప్రాంతాల్లో సముద్రం 50 మీటర్ల మేర ముందుకొచ్చింది. చెన్నై మెరీనా బీచ్‌లో సముద్రం 2 మీటర్ల మేర ముందుకొచ్చింది. పుదుచ్చేరి, కడలూరు జిల్లాలు పూర్తిగా నష్టపోయాయి. పరిస్థితిని అంచనా వేసిన జయలలిత తక్షణ సహాయ చర్యల కోసం రూ.150 కోట్ల నిధుల్ని విడుదల చేయడమే కాకుండా సహాయ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 15 జిల్లాల్లో విద్యాలయాలకు, కార్యాలయాలకు శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా, దక్షిణాది జిల్లాలకు వెళ్లే ఐదు రైళ్లను దక్షిణ రైల్వే అధికారులు రద్దు చేశారు. చెన్నై నుంచి వెళ్లే నాలుగు విమానాలు రద్దయ్యాయి.

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి టీటీడీ రగ్గులు, పాలు, టీ, కాఫీ పంపిణీ చేస్తోంది. వర్షాలతో చిత్తూరు జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. నెల్లూరు జిల్లాలో చలి పెరగడంతో ఏడుగురు మరణించారు. కడపలో వరి, పొద్దుతిరుగుడు , మామిడి పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రానికి గండం తప్పిందని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. తుఫాను తీరం దాటినా సహాయ చర్యలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతాయని చెప్పారు. కాగా, ఇదే అంశంపై ఢిల్లీలో ఉన్న సీఎం కిరణ్ మంత్రి రఘువీరా, సీఎస్ పంకజ్ ద్వివేదిలతో ఫోన్‌లో మాట్లాడి సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+