బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకెక్కిన ఐఎఎస్ శ్రీలక్ష్మి

అనారోగ్యంతో బాధపడుతున్నందున, తాను మహిళను అయినందున తనకు బెయిల్ కొనసాగించాలని, సీబీఐకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని, ఏ తప్పు చేయలేదు కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశంలేదని ఆమె చెప్పుకున్నారు. అయితే గాలి జనార్ధన్‌రెడ్డి తరఫున వాదించిన న్యాయవాదులే శ్రీలక్ష్మి కేసును వాదించడం విశేషం. ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సోమవారం హైకోర్టు కొట్టివేస్తూ, ఈనెల 6వ తేదీ లోపల నాంపల్లి కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications