10న తెలంగాణలో అడుగు పెట్టనున్న వైయస్ జగన్

తెలంగాణలో రైతు బతుకులు అధ్వాన్నంగా మారాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మహారాష్ట్రలో పత్తి ధరలు పడిపోతే అక్కడి రైతులు ఆదిలాబాద్‌కు వచ్చి అమ్ముకున్నారని ఆయన చెప్పారు. అప్పుడు ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర లభించేదని ఆయన అన్నారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన అన్నారు. రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తెలుగుదేశ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో తమకు పోలికేమిటని, చంద్రబాబు రైతులను పీల్చి పిప్పి చేశారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.












Click it and Unblock the Notifications