బాబు ఇంటింటి పెగ్గు ఆలోచన తప్పు: వైయస్ జగన్

తమ పార్టీ అధికారంలోకి వస్తే సువర్ణ పాలన అందిస్తామని ఆయన చెప్పారు. అది ఎంతో దూరంలో లేదని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు, మద్యం దుకాణాలు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి వేయి మంది ఉన్న గ్రామానికి 10 మంది మహిళా పోలీసులతో స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కల్తీ సారా బాధితులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు రాకపోవపడం దారుణమని ఆయన అన్నారు. కల్తీ సారా బాధితులకు 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని తాము ప్రకటించిన తర్వాతనే ప్రభుత్వం రెండేసి లక్షల రూపాయల నష్టపరిహారానం ప్రకటించిందని ఆయన అన్నారు. గ్రామాల్లో సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications