అంబటి నిజాలు దాస్తున్నాడు: ఎపిఐఐసి చైర్మన్

ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలున్నాయన్నారు. అంబటి ఎపిఐఐసి చైర్మన్‌గా ఉన్న సమయంలో సిఫార్సు చేస్తూ రాసిన లేఖలు కూడా ఉన్నాయన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు తలవంచక తప్పదన్నారు. మీడియా ముందు ఆయన నిజాలు చెప్పాలన్నారు. కాగా ఆదివారం అంబటి రాంబాబు సిబిఐ అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను కేవలం సాక్షిగానే పిలిచారని, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే అక్రమాలు జరిగాయని, ఆ జీవోలపై విచారణ జరపాలని సిబిఐని కోరినట్లు చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications