జగన్ పగటి వేషం, కెసిఆర్ రెండు కళ్ల సిద్ధాంతం: టిడిపి

జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తిగా నిరర్థకంగా మిగిలిపోయాయని మరో నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రభుత్వం ఎత్తిపోతల భారం రైతులపై వేయడం శోచనీయమన్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టులు ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి తెలియవని ఎద్దేవా చేశారు. పండుగగా ఉన్న వ్యవసాయాన్ని దండుగగా మార్చారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిషలు కృషి చేస్తుందన్నారు.
జగన్ కాంగ్రెసుతో పొత్తు కోసం టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు ఉవ్వీళ్లూరుతున్నారని మరో నేత పెద్దిరెడ్డి వేరుగా ధ్వజమెత్తారు. జగన్ క్యాంపుకు తెలంగాణలో కెసిఆర్ కాపలాదారు అన్నారు. రాష్ట్రంలో జగన్, ఢిల్లీలో కాంగ్రెసు అంటూ కెసిఆర్ రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకెళుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications