వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భువితేజ స్కామ్ వెనక వైయస్ టీమ్: పయ్యావుల

By Pratap
|
Google Oneindia TeluguNews

Payyavula
హైదరాబాద్: అప్పనంగా విలువైన భూమిని కొట్టేసిన భువి తేజ కుంభకోణం వెనక దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బృందం ఉందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఈ కుంభకోణంలో అప్పటి ఎపిఐఐసి చైర్మన్ అంబటి రాంబాబు పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. తేజ ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీ అప్పనంగా పాతిక కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కొట్టేసిందని ఆయన ఆరోపించారు. ఒక పెట్రోలు బంకు కట్టుకుంటామని చెప్పి ఏకంగా 11 అంతస్తుల భవనం కట్టేస్తున్నారని ఆయన వెల్లడించారు. పైసా పెట్టుబడి లేకుండా తేజ ఎంటర్‌ప్రైజెస్ ఇంతగా లబ్ధి పొందడానికి బి.పి. ఆచార్య హస్తలాఘవమే కారణమని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన చిట్టా మొత్తాన్ని కేశవ్ గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులకు అందజేశారు.

అసలు రాష్ట్ర రికార్డులలోనే లేని తేజ ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీ ఫలానా చోట పెట్రోలు బంకుకోసం ఎకరం స్థలం కావాలని కోరిందని, ఇందుకు సంబంధించిన అనుమతులు 48 గంటల లోపే చకచక మంజూరు అయిపోయాయని ఆయన వివరించారు. అసలు ఈ మొత్తం ఎలా ప్రారంభమైందో వివరిస్తూ ఈ భూమికోసం ఒక కోటి 60 లక్షల రూపాయలను బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఒక కోటి 14 లక్షల రూపాయలకే ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని, మళ్లీ అదే భూమిని 23 కోట్ల రూపాయలు విలువ చేస్తుందంటూ థర్డ్ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్నారని, తేజ నుంచి భువితేజ సంస్థ వరకు జరిగిన మాయాజాలం మొత్తం వెనుక వైయస్సార్ అండ్ కంపెనీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

భూమి కేటాయించేనాటికి రికార్డులలో ఆ కంపెనీయే లేదని వెల్లడిస్తూ భూమి కేటాయింపులు జరిగిన తర్వాతే ఆ కంపెనీ రికార్డులలోకి చేరిందని ఆయన వివరించారు. పెట్రోలు బంకు కోసం అనుమతి పొందిన వారు 11 అంతస్తుల భవంతి నిర్మాణం ఎలా చేపడతారని, ఇది నిబంధనలకు విరుద్ధం అనీ ఆయన ఆరోపించారు. అందువల్ల ఈ స్థలం మొత్తాన్ని బీహార్ పద్ధతిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. సామాన్య ప్రజలు చిన్న స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో చట్టాలను ఉటంకించే ప్రభుత్వం ఇలా తాడూబొంగరం లేని కంపెనీలు ఎలా ఆడితే అలా ఆడనిచ్చాయని ఆయన ఆవేద న వ్యక్తం చేశారు.

English summary
TDP MLA Payyavula Keshav alleged that YSR team is behind the Bhuvi Teja scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X