విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ వరం, కండీషన్స్ అప్లై..!!

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం మరో వరం ప్రకటించేందుకు సిద్దమైంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీ కరణ జరగదని కూటమి నేతలు చెబుతూ వచ్చారు. అందులో భాగంగా గత ఏడాది కేంద్రం ప్లాంట్ కోసం ఆర్దిక ప్యాకేజీ ప్రకటించింది. ఇక.. కొంత కాలంగా ప్లాంట్ లో చోటు చేసుకుంటున్న పరిణామా ల పైనా ఉద్యోగ సంఘాలు యాజమాన్యం నుంచి భరోసా కోరుతున్నాయి. ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన తాజా ప్రతిపాదన పైన చర్చల తరువాత కేంద్ర ఆర్దిక శాఖ తొలుత నో చెప్పినా.. ఆ తరువాత కొన్ని కండీషన్లతో ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం మరో తీపి కబురు అందిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్దిక శాఖ తుది కసరత్తు చేస్తోంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి రెండో విడత ఆర్థిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం గతేడాది జనవరిలో రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఉక్కు శాఖ చెప్పినవన్నీ చేయడం, మూతపడిన మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్ ను వినియోగంలోకి తేవడంతో ఉత్పత్తి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో కర్మాగారం రూ.54 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. స్టీల్‌ తయారీకి అవసరమైన కోక్‌ ప్లాంటులోనే తయారవుతుంది. విదేశాల నుంచి కోకింగ్‌ కోల్‌ దిగుమతి చేసుకొని, కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ(పారిశ్రామిక బట్టీ)ల ద్వారా కోక్‌ తయారు చేస్తారు. మొత్తం ఐదు బ్యాటరీలు ఉండగా వాటిలో రెండు(3, 4) పూర్తిగా పాడైపోయాయి. దాంతో వాటిని మార్చి నెలాఖరులో మూసేశారు. ఐదో నంబరు బ్యాటరీ కూడా మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం 1, 2 బ్యాటరీల ద్వారానే కోక్‌ తయారవుతోంది. ఇది పూర్తిస్థాయి ఉత్పత్తికి సరిపోవడం లేదు.

central-govt-likely-to-announce-rs-8-097-cr-financial-support-for-visakha-steel-plant-here-the-det

కేంద్రం చర్చలు... ఆమోదం దిశగా కసరత్తు

దీంతో, కోక్‌ను బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర పెట్టి కొంటున్నారు. కొత్త కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కోక్‌ బయట కొనడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కొత్త కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఉక్కు శాఖ ప్రతిపాదించింది. దీనికి సుమారు రూ.6వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇంకా మరికొన్ని పనులకు కలిపి మొత్తం రూ.8,097 కోట్ల ఆర్థిక సాయం కావాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. తొలుత ఆర్థిక శాఖ నిరాకరించినా... విశాఖ ఉక్కును నిలబెట్టాల్సి ఉందని కేంద్రంలో పెద్దలు స్పష్టం చేయడంతో ఆ ఫైల్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయం వేళ కొన్ని షరుతులను విధించినట్లు సమాచారం. వీటికి పూర్తి స్థాయిలో అంగీకారం రాగానే.. త్వరలోనే ఈ నిధులను కేంద్రం ప్లాంట్ కోసం విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+