AP SSC Result 2026 LIVE: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీలో విద్యార్ధులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు (AP SSC Result 2026 ) విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలు విడుదల అయిన తర్వాత విద్యార్ధులు వాటిని ఎలా తెలుసుకోవాలి, ఆన్ లైన్, వాట్సాప్ లలో ఫలితాలు తెలుసుకునే విధానం వంటి వివరాలను అధికారులు వెల్లడించారు.

ఏపీలో 10వ తరగతి ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం ఫలితాలు తెలుసుకునేందుకు 3 మార్గాలున్నాయి. వీటిలో అధికారిక వెబ్ సైట్లతో పాటు వాట్సాప్, ఎస్ఎంఎస్ రూపంలో కూడా తెలుసుకోవచ్చు.

LIVE Class 10 Scores Out at 11 AM Check Your Result Now

1. అధికారిక వెబ్‌సైట్లు:

- http://bse.ap.gov.in
- http://results.bse.ap.gov.in
- http://examresults.ap.nic.in
- http://manabadi.co.in

2. WhatsApp
9552300009
నంబర్‌కు "Hi" అని పంపండి → చాట్‌బాట్ సూచనలను అనుసరించండి → Education Services (విద్యా సేవలు) ఎంచుకోండి.

3. SMS:
SSC Rol l Number అని టైప్ చేయండి
55352
లేదా 56300 నంబర్‌కు పంపండి.

ఫలితాలు తెలుసుకునేందుకు కావాల్సిన వివరాల్లో రోల్ నంబర్ /హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ లేదా పూర్తి పేరు. ఫలితాలు తెలుసుకునేందుకు హాల్ టికెట్‌ను దగ్గర ఉంచుకుని నంబర్ ఎంటర్ చేస్తే చాలు ఫలితం కనిపిస్తుంది. మిగతా వివరాలు ఫలితాల పేజ్ లో చూసుకుని నిర్ధారించుకోవాలి. మొత్తం 6.4 లక్షల మంది విద్యార్ధులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి వెబ్ సైట్లపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+