ఏపీలో పది ఫలితాలు రేపే, టైం ఇదే - లోకేష్ ప్రకటన.. ఇలా తెలుసుకోండి..!!
ఏపీలో పదో తరగతి విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ఫలితాల విడుదల ముహూర్తం అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ రోజు తెలంగాణలో పది ఫలితాల ను విడుదల చేస్తున్నారు. దీంతో.. రేపు (గురువారం) ఏపీలో పదో తరగతి ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ప్రకటన చేసారు. ఈ సారి ఫలితాలు.. మార్కులు వెంటనే తెలుసుకునే విధంగా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ ఫలితాలను గురువారం (ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విడుదల చేసేందుకు నిర్ణయించారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. పదో తరగతి లో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలో ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 1తో పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో చేపట్టిన మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. ఎస్‌వోలు, సీఎస్‌లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మార్కులను మాన్యువుల్‌తో పాటు ట్యాబ్‌ల్లోనూ నమోదు చేశారు.

వాట్సప్ ద్వారా మార్కులు తెలుసుకొనే అవకాశం
ఎక్కడా మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్‌లను తీసుకొచ్చారు. మొదట్లో ట్యాబ్ లో ఎంట్రీ చేసే క్రమంలో కొంత జాప్యం జరిగినప్పటికీ... చివరగా ఈ ప్రక్రియ కూడా పూర్తి అయింది. సాంకేతిక ప్రక్రియను, కోడింగ్, డీకోడింగ్ సాంకేతిక పనులను కూడా వేగంగా పూర్తి చేశారు. దీంతో త్వరగానే ఫలితాలను సిద్ధం చేశారు. ఏపీ పదో తరగతి ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లేదా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ లో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. అదే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన మన మిత్ర వాట్సప్ ద్వారాను ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మొబైల్‌లో 95523 00009 నంబర్ కు హాల్ టికెట్ నెంబర్ పంపటం ద్వారా ఫలితాలను వెంటనే తెలుసుకొనే అవకాశం కల్పించారు.













Click it and Unblock the Notifications