డెడ్ ఈజీ- వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లల్లో ఇకపై..!!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా సంచలనానికి తెర తీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మ్యూస్ స్పార్క్ (Muse Spark) పేరుతో ఓ కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను ఆవిష్కరించింది. గత ఏడాది కాలంగా మెటా తమ కొత్త ఏఐ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టిన ఫలితమే ఈ టూల్. అంతర్గతంగా అవకాడో అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ కొనసాగింది.
ప్రస్తుతం- మ్యూస్ స్పార్క్‌ను మెటా తన ఇండిపెండెంట్ ఏఐ యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో, దీనిని వాట్సాప్ (WhatsApp), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ (Meta AI smart glasses) వంటి ఇతర యాప్‌ల కోసం విడుదల చేయనుంది. ఈ మ్యూస్ స్పార్క్.. గూగుల్, ఓపెన్ఏఐ (OpenAI) వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే మెటా ఈ అడుగు వేసినట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అందుబాటులో ఉన్న మెటా ఏఐ కొన్ని విభాగాల్లో వెనుకంజలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. ఈ వేగాన్ని అందుకునే క్రమంలో మ్యూస్ స్పార్క్ కు బీజం పడింది. దీని రాకతో కంపెనీ భారీ ప్రయోజనాలను ఆశిస్తోంది. ప్రయోగదశలో ముఖ్యంగా రైటింగ్, రీజనింగ్ సామర్థ్యాలలో మ్యూస్ స్పార్క్ మెరుగైన ఫలితాలను చూపింది. ఇది ఓపెన్ఏఐ, గూగుల్, ఆంథ్రోపిక్ (Anthropic) వంటి టాప్ మోడల్స్‌కు సవాల్ విసరనుంది.
వీటితో పోల్చుకుంటే కోడింగ్ సామర్థ్యం విషయంలో మాత్రం కొంత అంతరం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రేసులో కోడింగ్ అవసరం ఓ అత్యవసరం. ఈ విషయంలో మ్యూస్ స్పార్క్ తన పోటీదారుల కంటే కొంచెం వెనుకబడే ఉంది. దీన్ని అధిగమించడంపై మెటా ప్రస్తుతం వర్కవుట్ చేస్తోంది. ప్రస్తుతానికి దీని కోడ్‌ను ప్రైవేట్‌గా.. అంటే క్లోజ్డ్ మోడల్ లో ఉంచింది మెటా. గతంలో మెటా తన ఏఐ మోడల్స్‌ను ఓపెన్ సోర్స్‌గా అందుబాటులో ఉంచేది. డెవలపర్లు ఆ కోడ్‌ను ఉపయోగించుకోవడానికి వీలు కల్పించేది. మ్యూస్ స్పార్క్ విషయంలో దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది.
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ సంవత్సరం నుంచి ఏఐ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తోన్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు నిష్ణాతులను భారీ వేతనాలతో ఏఐ టీమ్ లో చేర్చుకున్నారు. ఈ స్ట్రాటజిక్ ఎక్స్ ఫాన్షన్లో భాగంగా 29 ఏళ్ల అలెగ్జాండర్ వాంగ్ కు భారీ మొత్తాన్ని చెల్లించి, చీఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హోదాను ఇచ్చారు. ఈ టీమ్ గతంలో లామా-4 (Llama-4) మోడల్‌పై పనిచేసింది.












Click it and Unblock the Notifications