దిమ్మ తిరిగే గాలి బ్రదర్స్ మాయా, చార్జిషీట్‌లో క్రోడీకరణ

Gali Janardhan Reddy
హైదరాబాద్: గాలి సోదరుల ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మాయాజాలం మరింతగా బయటపడుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని టీవీ చానెళ్లు గురువారం వార్తాకథనాలను ప్రసారం చేశాయి. కోర్టులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఆ చానెళ్లు ఈ వార్తాకథనాన్ని ప్రసారం చేశాయి. ఆ వార్తాకథనాల ప్రకారం - గాలి సోదరులకు అనేక బ్యాంకులలో బినామీ లాకర్లు ఉన్నట్టు తేలింది. గాలిపై కేసు నమోదు అయిన వెంటనే ఆ లాకర్లు ఖాళీ అయ్యాయి. వాటిలోని కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాలు చిటికెలో మాయం అయిపోయాయి. అంతే కాదు, అక్రమ మైనింగుకు గాలి సోదరులు సుంకులమ్మ దేవాలయాన్ని నేలమట్టం చేశారు.

గాలి సోదరులు కర్నాటకలో గనుల త్రవ్వకాలు జరిపి అనంతపురంలో జరిపినట్టుగా తప్పుడు రికార్డులు సృష్టించారు. ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలను సిబిఐ సేకరించింది. ఈ మేరకు సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జి షీటు ప్రతులను నిందుతులు శ్రీలక్ష్మికి, రాజగోపాల్‌కు అందజేశారు. గాలికి చెందిన కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను విశ్లేషించడంతో ఒఎంసి అక్రమాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. గనులకు సంబంధించిన అన్ని రకాల మైనింగు లీజులకు సంబంధించిన రికార్డులను భద్రంగా ఉంచాలన్న నిబంధనలను గాలికి సహకరించిన అధికారులు తుంగలోకి తొక్కారని ఈ ఛార్జి షీటులో ఆరోపించారు. సుదీర్ఘంగా దర్యాప్తు సాగించిన ఫలితంగానే సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయగలిగారు. అరెస్టు చేసిన అనంతరం దర్యాప్తు చేస్తుండగా వారి బ్యాంకు ఖాతాలు చూడగా సి.బి.ఐ. అధికారులు విస్మయానికి గురయ్యారు. ఆ అకౌంట్లలో అతి చిన్న మొత్తాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు పాత రికార్డులు పరిశీలించగా, కేసు నమోదు అయిన మూడు రోజులకే లాకర్లు ఖాళీ అయినట్టు తెలుసుకున్నారు.

ఆరు ప్రాంతాలలో తవ్వకాలకు అనుమతి సంపాదించిన గాలి సోదరులు 40 చోట్ల తవ్వకాలు జరిపారు. అది కూడా రిజర్వ్ ఫారెస్టు లోపలికి వెళ్లిపోయి మరీ తవ్వకాలు జరిపారు. ఇందుకు వారు మూడు కిలోమీటర్ల పొడవునా ప్రయివేటు రహదారిని ఏర్పాటు చేశారు. ఇది కూడా చట్ట వ్యతిరేకమే. వీరు ఏయే ప్రాంతాలకు ఏ తరహా ఇనుప ఖనిజం ఎగుమతి చేసిందీ వివరాలు సేకరించారు. తీరా చూస్తే వీరికి ఏ ఇనుప ఖనిజం తవ్వకానికి అనుమతి పొందారో ఎగుమతి అయ్యింది ఆ ఇనుప ఖనిజం కాదు. ఈ పద్ధతిన వారు 5000 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్టు తెలుస్తున్నది. గాలి సోదరులపై కేసు నమోదు చేసినప్పుడు కోట్లాది రూపాయల విలువైన నగదుతోపాటు 53 కిలోల బంగారం కూడా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంకా ఒక రోల్స్ రాయిస్ కారు, ఒక హెలికాప్టర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 201 మంది సాక్షుల నుంచి సిబిఐ సాక్ష్యాలు సేకరించింది. ఈ కేసుకు సంబంధించి 60000 పేజీల సప్లిమెంటరీ సాక్ష్యాలను సేకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+