నేను రెడీ, తేదీ, చెప్పు: పయ్యావుల సవాల్‌కు అంబటి

Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన సవాల్‌ను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. తనపై పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బహిరంగ చర్చకు తేదీని, వేదికను పయ్యావుల కేశవ్ నిర్ణయిస్తే తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఆధారాలు ఉంటే తీసుకువచ్చి పయ్యావుల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు. తాను పారిపోదలుచుకోలేదని ఆయన అన్నారు. రాజకీయ రచ్చ కోసం మీడియా ముందు పయ్యావుల రంకెలు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా అర్థరహిత విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేస్తే బహిరంగ చర్చకు తాను ప్రదేశం, తేదీ నిర్ణయించడమేమిటని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడిని విచారించాల్సి వచ్చినందున వారికి పిచ్చెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పయ్యావుల కేశవ్ నేల విడిచి సాము చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఎపిఐఐసి చైర్మన్‌గా ఉన్నప్పుడు ఏ విధమైన అక్రమాలు జరగలేదని, ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+