వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు జైళ్లో ఉండేవారేమో, దాసరి లేఖ తప్పుకాదు: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకుంటే జైళ్లో ఉండే వారేమోనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం అభిప్రాయపడ్డారు. ఆయన మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గంటకో మాట మాట్లాడుతుంటారని ఆయన మాటలు చూస్తుంటే తమకు జాలేస్తోందన్నారు. బాబు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం మానేసి తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. బాబు కోర్టుకెళ్లడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న జగన్ వ్యాఖ్యలను ఎవరూ నమ్మరన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎంపీ దాసరి నారాయణ రావు లేఖ రాశారనే వార్తలపై ఆయన స్పందించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో, సమష్టిగా ముందుకు పోతోందన్నారు. నాకు తెలిసి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రభుత్వాన్ని అస్థిర పరచడం లేదన్నారు. దాసరి లేఖ రాయడంలో తప్పులేదన్నారు. అయినా ఆయన లేఖ తన దృష్టికి రాలేదన్నారు. ఆయనంటే తనకు ప్రత్యేకమైన గౌరవం ఉందన్నారు. చిరంజీవి వర్గంలోని సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారన్నారు. తన శాఖ మార్పు సిఎం దృష్టికి తీసుకు వెళ్లానని ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. జోడు పదవుల ఉండకూడదన్న నిబంధన ఏమీ లేదన్నారు. అరకు పర్యటనను రాజకీయ కోణంలో చూడవద్దని సూచించారు.

English summary
PCC chief Botsa Satyanarayana fired at Chandrababu Naidu and YS Jaganmohan Reddy for their statements. He responded on Dasari Narayana Rao letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X