హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బిజినెస్‌మెన్' సిఎం!: సూపర్ హిట్టన్న కిరణ్ కుమార్‌

|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. సదస్సులో ముఖ్యమంత్రి రెండో రోజు పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సాహమే రెండో రోజూ సదస్సులో కనిపించింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు ఏం కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మేమిచ్చిన ప్రోత్సాహకాలలను చూసి పక్క రాష్ట్రాలతో బేరాలు పెట్టొద్దని పారిశ్రామికవేత్తలకు సూచించారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు నాణ్యమైన నీరు, విద్యుత్ అందిస్తామన్నారు. ఈ-బిజినెస్ కోసం ఏర్పాటు చేసిన జి2బి పోర్టల్ ప్రాజెక్టుకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పారు. పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు.

భూనిర్వాసితులు, స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై త్వరలో విధానం తెస్తామన్నారు. మరో 22 ప్రాజెక్టులు మొదలయ్యాయన్నారు. ఇప్పటి వరకు రూ.6.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు అందాయన్నారు. శుక్రవారం మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత కోసం మూడు నెలల్లో పౌర సేవలను ఆన్‌లైన్లో నిర్వహిస్తామన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said today in international business summit that summit is super hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X