తెలంగాణ పర్యటన: చంద్రబాబుకు భిన్నంగా జగన్ తీరు

అంతగా కాకున్నా తెలంగాణ పర్యటనకు ముందు చంద్రబాబు కంటే క్లారిటీ ఇచ్చిన జగన్ తన పర్యటనలో మాత్రం ఏమీ మాట్లాడపోవడం ఆయన టి-పార్టీ నేతలకు అసహనం కలిగించినట్లుగా కనిపిస్తోంది. ఆఖరి రోజు బహిరంగ సభలో జగన్ కేవలం రైతు సమస్యలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు పైనే విరుచుకు పడ్డారు. పర్యటనకు ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షను తమ పార్టీ గౌరవిస్తుందని, అందుకే తాము ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పడం ద్వారా టిడిపి కంటే తెలంగాణవాదుల మన్ననలు పొందగలిగారు. కానీ మూడు రోజుల పాటు జరిగిన దీక్షలో గానీ, చివరి రోజు బహిరంగ సభలో గానీ జగన్ తెలంగాణపై ఏమీ మాట్లాడక పోవడం తెలంగాణవాదులను ఆగ్రహానికి గురి చేసిందట. అయితే పార్టీ నేతలు మాత్రం జగన్ ఇప్పటికే తెలంగాణపై క్లారిటీ ఇచ్చారని ఇంతకంటే ఇవ్వలేరని చెప్పుకు రావడం విశేషం.












Click it and Unblock the Notifications