వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16 వరకు విజయ సాయి రెడ్డి కస్టడీ పొడిగించిన కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

vijaya sai reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన విజయ సాయి రెడ్డిని మరో మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతించింది. శనివారం నుండి సోమవారం వరకు అంటే పదహారో తేది వరకు ఆయన కస్టడీకి అనుమతించింది. తిరిగి పదిహేడో తేదిన కోర్టులో హాజరు పర్చాలని సిబిఐని ఆదేశించింది. దీంతో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విజయ సాయి రెడ్డిని సిబిఐ అధికారులు విచారించనున్నారు. కాగా తన సిబిఐ కస్టడీపై విజయ సాయి రెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు నాంపల్లి ఆర్థిక నేరాలను విచారించే కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. విజయ సాయి కస్టడి కావాలంటే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది.

కాగా మూడు రోజుల క్రితం విజయ సాయి కస్టడీ ముగియడంతో మరో వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ అదే కోర్టును కోరింది. అందుకు ఆ కోర్టు అనుమతించింది. దీంతో విజయ సాయి రెడ్డి ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించే పనికి సిబిఐ పూనుకుంది. అయితే ఆయన క్వాష్ పిటిషన్ పైన స్పందించిన హైకోర్టు కస్టడీ రద్దు చేయడంతో సిబిఐ తిరిగి సిబిఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆయనను మూడు రోజుల కస్టడీకి అప్పగించింది.

English summary
CBI special court extended Jagathi publications vice chairman Vijaya Sai Reddy's custody for three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X