సందడే సందడి: సంక్రాంతి కోసం స్వగ్రామానికి బాబు

ఈ సందర్భంగా బాబు నారావారిపల్లెలో ఎన్టీఆర్ ట్రస్టు నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తారు. సోదరుడు రామ్మూర్తినాయుడు ప్రతిష్టించిన ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తారు. చంద్రబాబు దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ స్వగ్రామం వెళుతున్నారు. నారా వారే కాకుండా నందమూరి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. ఇప్పటికే వచ్చిన వారికి గ్రామ ఆడపడుచులు స్వాగతం పలికారు. బంధువుల రాకతో అక్కడ సందడి మొదలైంది. కాగా చాలాకాలం తర్వాత స్వగ్రామానికి వస్తున్న బాబుతో కలిసి మాట్లాడాలని ఆయన పాత స్నేహితులు ఎదురు చూస్తున్నారు. కాగా రాత్రి తిరుమలకు చేరుకొని అక్కడే బస చేసి ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరతారు. కాగా చంద్రాబాబు తిరుపతి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications