సీమాంధ్రలో తెలంగాణ నాయకుల పర్యటనలు?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కొద్ది మంది పెట్టుబడిదారులైన రాజకీయ నాయకులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, ప్రజలకు వ్యతిరేకత లేదని తెలంగాణ నాయకులు వాదిస్తూ వస్తున్నారు. దాన్ని నిరూపించడానికే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు తెలంగాణ నాయకుల సీమాంధ్ర పర్యటనలు ఉపయోగపడుతాయని భావించారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రతినిధులతో కలిపి ఇరు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో ప్రకటించారు. అయితే, కార్యరూపం దాల్చలేదు. ఏమైనా, అటువంటి ఆలోచన కార్యరూపం తీసుకుంటే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది












Click it and Unblock the Notifications