చిరంజీవికి రాష్ట్ర మంత్రివర్గంలో బెర్తు ఖాయం: మోపిదేవి

తాను ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుహ్యంగా ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇటీవల మైలవరంలో జరిగిన కల్తీ మద్యం మరణాలు కొన్ని దుష్టశక్తుల కారణంగా చోటు చేసుకున్నాయని, ఇందులో ఇందులో ఎక్సైజ్ శాఖ వైఫల్యమేమీ లేదని చెప్పారు. శాఖాపరంగా సిబ్బంది లేదా అధికారుల తప్పులేవైనా ఉన్నట్టు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోపిదేవి చెప్పారు. కాగా చిరంజీవిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇటీవల పలువురు నేతలు కోరుతున్న విషయం తెలిసిందే. కడప జిల్లా నేతలు కూడా చిరంజీవి రాష్ట్రంలోనే ఉండాలని కేంద్రానికి వద్దని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications