గొడ్డలితో భార్యను నరికిన భర్త, సిటీలో సూసైడ్ యత్నం

khammam
ఖమ్మం/హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలంలో ఆదివారం ఘోరం జరిగింది. మండలంలోని రాంపూర్ తండాలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్‌లో ఓ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ నగర్‌లో బండారు బాలిరెడ్డినగర్ బస్తీలో నివసించే మహిళ ఇంట్లో గొడవల కారణంగా శనివారం అర్ధరాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని, తనతో పాటు తన పిల్లలకు కూడా నిప్పంటించింది. ఈ ఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పిల్లలు, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలంలోని మేనకూరు ఎస్సీ కాలనీలో గ్యాస్ స్టౌ పేలింది. ఈ సంఘటనలో తల్లీ కూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఘోరంపూడిలో పంట పొలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 13 ఎకరాల్లో మంటలు చెలరేగాయి. దీంతో వరికుప్పలు మంటలకు అంటుకు పోయాయి. సుమారు రూ.5లక్షల మేర నష్టం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+