విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జోరుగా కోడిపందేలు: పాల్గొన్న సినీ,రాజకీయ విఐపిలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

west godavari
విజయవాడ/ఏలూరు/రాజమండ్రి: సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కోళ్ల పందేలు, ఎడ్ల పందేలు జోరుగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో కోళ్ల పందాల సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ పందేలను చూడటానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వచ్చారు. కొన్ని పందేలను రాజకీయ నాయకులే ప్రారంభించారు. కోళ్ల పందేలు మన సంస్కృతిలో భాగమని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. వాటిని చూసి ఆనందించడానికే తాము వచ్చామంటున్నారు. కృష్ణా జిల్లాలో ఎడ్ల పందేలు జోరుగా జరుగుతున్నాయి. ఎడ్ల పందేలను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎడ్ల, కోళ్ల పందేలు సంక్రాంతి పండుగలో భాగమని, అందుకే తాము వీటిని జరుపుకుంటున్నామని చెబుతున్నారు. ఈ పందేలు మూడు రోజులు జరుగుతాయి.

తూర్పు గోదావరి జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక, భీమవరం మండలం వెంప శ్రీరామపురం, ఐ.భీమవరం, తణుకు, నిడదవోలు, నరసాపురం తదితర ప్రాంతాల్లో పందేలు జరుగుతున్నాయి. కాగా పందేల్లో కొందరు భారీగా డబ్బులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పందేలు సోమవారంతో ముగుస్తాయి. ఆదివారం రెండో రోజు. కాగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Cine and Political VIPs participated 
 
 in Sankarati bettings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X