చిరంజీవి కలిశాకే చంద్రబాబుకు ధైర్యం వచ్చింది: జగన్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేందుకు తెలుగుదేశం, కాంగ్రెసు కుట్ర పన్నాయన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని దానిని బాగుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైయస్ రెక్కల కష్టం కారణంగానే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయం మానేస్తే మానం పోయినట్లు చేస్తే ప్రాణం పోయినట్లుగా రైతుల పరిస్థితి ఇప్పుడు ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జగన్ జిల్లాలోని పలు గ్రామాల్లో దివంగత వైయస్ విగ్రహాలను ఆవిష్కరించారు. పెదపాలెంలో మరియమ్మ కుటుంబాన్ని ఓదార్చారు.












Click it and Unblock the Notifications