మావోల మందుపాతరకు 13 మంది పోలీసుల బలి

బాద్గఢ్ వద్ద అడ్డంకులను తొలగించి బ్లాక్ డెవలప్ మెంట్ అధికారితో పాటు పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. తన సొంత వాహనంలో ప్రయాణిస్తున్న బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి సురక్షితంగా బయటపడ్డారు. యాంటీ ల్యాండ్‌మైన్ వాహనంలో డ్రైవర్ సహా 15 మంది పోలీసులు ఉన్నారు. పేలుడు తర్వాత పోలీసులకు చెందిన 14 ఆయుధాలను నక్సలైట్లు తీసుకుని వెళ్లారు. గాయపడిన ఇద్దరు పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మందుపాతర దాటికి పోలీసు వాహనం గాలిలో ఎగిరి కిందపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications