వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీలో ప్రాధాన్యతలేదు!: రాయపాటి, విహెచ్ అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao and Rayapati Sambasiva Rao
హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌పై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఆదివారం గాంధీ భవన్‌లో ఆజాద్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ల ప్రాధాన్యత తగ్గడం సరికాదని, వారికిచ్చే ప్రియారిటీ వారికివ్వాలన్నారు. మాచర్ల, పత్తిపాడు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తేనే గెలిపించి తీరుతామన్నారు. తాను ఆజాద్‌ను ఏమీ అడగలేదన్నారు. మరో నేత వి హనుమంత రావు మాట్లాడుతూ పార్టీలో అగ్ర వర్ణాలకే పెద్ద పీట వేయడం బాధాకరమన్నారు. పదవుల విషయంలో దళితులకు అన్యాయం జరిగిందన్నారు. పదవులన్నీ ఆగ్ర కులాలకేనా అని ప్రశ్నించారు. ఎనభై శాతం ఓట్లు వెనుక బడిన వర్గాల వారివేనన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే బలహీనవర్గాల బలం తెలుసుకున్నాడన్నారు.

కాగా అంతకుముందు ఆజాద్‌పై అమలాపురం ఎంపీ హర్షకుమార్ మండిపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు ఆజాదే కారణమని, ఆయనే బాధ్యత వహించాలని, దళితులకు అన్యాయం జరుగుతోందని, ఆజాద్‌పై సోనియాకు ఫిర్యాదు చేస్తానని ఫైర్ అయ్యారు. అంతేకాదు ఆజాద్ ఎదుట కూడా పార్టీలో భేదాభిప్రాయాలు బయటపడ్డాయట. ఒక వర్గం నేతలు మరో వర్గంపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారట.

English summary
Congress Party seniors V Hanumantha Rao and Rayapati Sambasiva Rao unhappy with party high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X