విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూ ఎన్టీఆర్ సహా ఎవరినీ దూరం చేసుకోం: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: జూనియర్ ఎన్టీఆర్ సహా ఎవరినీ తాము దూరం చేసుకోబోమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా చెప్పారు. కుటుంబం కంటే పార్టీ ముఖ్యమని, పార్టీ అన్నది ప్రజలకు సంబంధించిందని, దానికి కొన్ని విధానాలుంటాయని, సమష్టి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తనకు కూడా కొన్ని బరువు బాధ్యతలుంటాయని ఆయన అన్నారు. తమది ఎన్టీఆర్ కుటుంబమని, అందులోనూ పెద్ద కుటుంబమని, కుటుంబ సమస్యలు కూడా అలాగే ఉంటాయని, అటు పార్టీని, ఇటు కుటుంబాన్ని కూడా కలుపుకెళ్ళే ప్రయత్నాలు చేస్తానని ఆయన వివరించారు.

సమస్యలొస్తే వారితో కూడా మాట్లాడుతానని, హరికృష్ణ కావచ్చు.. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు.. మరొకరు కావచ్చు... ఎవరినీ దూరం చేసుకునే పరిస్థితి ఉండదని, పార్టీని కాపాడుకోవడం కూడా ముఖ్యమైన విషయమేనని ఆయన అన్నారు. బాలయ్య, చిరంజీవి మధ్య మాటల యుద్ధం గురించి ప్రశ్నించగా - తాము వ్యక్తిగతంగా ఎవరి మీదకు వెళ్లబోమని, సిద్ధాంతాలపరంగా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. టీడీపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరులు కుల, మతాలను వాడుకుంటున్నారని, కానీ టీడీపీ ఎప్పుడూ అలా చేయదని, సమతుల్యత పాటిస్తుందని అన్నారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని, చిరంజీవి పార్టీలోకి వెళ్ళి.. అటు నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన టీడీపీ వారిని వెనక్కి వచ్చేయాలని కోరుతున్నామని, అద్దె ఇల్లు కంటే ఎప్పుడైనా సొంతిల్లే హాయిని, సంతోషాన్ని ఇస్తుందని, పార్టీ వల్ల అలా వెళ్ళిపోయిన వారికి ఎప్పుడైనా అన్యాయం జరిగి ఉంటే వాటిని సరిదిద్దుతామని కూడా చెబుతున్నామని ఆయన అన్నారు.

వైయస్ జగన్ తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా మీడియా, న్యాయవ్యవస్థ, ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారని, 2004 నుంచి తాను ఫలానా వ్యాపారాలు చేసి అంత డబ్బును సంపాదించానని తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టమనండని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీతో అనేక పార్టీలు జతకట్టాయని, కానీ టీడీపీ మాత్రం ఎప్పుడూ ఆ పార్టీకి దూరంగానే ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఆ పార్టీ తానులో నుంచి వచ్చిందే కదా అని, జగన్‌కు తమను విమర్శించే అర్హత ఎక్కడ ఉందని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu in an interview to a Telugu daily spoke about Jr Ntr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X