బెదిరింపులపై చర్యలు తీసుకోండి: కోదండరామ్ డిమాండ్

మరోవైపు తెలంగాణ భవనంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేత నాయిని నర్సింహా రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మావోయిస్టులపై మండిపడ్డారు. మావోయిస్టులకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ కోసం ప్రజల్లోకి వచ్చి పోరాడాలని సూచించారు. టిఆర్ఎస్‌పై మావోయిస్టు నేత జగన్ చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల సమస్యలపై పోరాటం చేసింది కేవలం టిఆర్ఎస్సేనని గుర్తుంచుకోవాలన్నారు. ఉనికి కోసమే జగన్ ఉద్యమ నేతలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది కేవలం తమ పార్టీయేనన్నారు.












Click it and Unblock the Notifications