జూ ఎన్టీఆర్, హరిలను పంపేందుకే బాలకృష్ణ: పార్థసారథి

Parthadarathi
విజయవాడ/హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలను పార్టీ నుండి బయటకు పంపించేందుకే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హీరో నందమూరి బాలకృష్ణను రంగ ప్రవేశం చేయించారని మంత్రి పార్థసారథి గురువారం విజయవాడలో అన్నారు. బాలకృష్ణ కూడా బాబు చేతిలో మోసపోతారని జోస్యం చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుపై చెప్పులు వేసిన చంద్రబాబుకు ఆత్మగౌరవంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బాలయ్య తమ పార్టీ నేత, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని విమర్శించే ముందు బాబు చరిత్ర తెలుసుకోవాలన్నారు. బాబు సంస్కారాన్ని మరిచి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు. కృష్ణా డెల్టాకు సంబంధించి బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.

చంద్రబాబు దద్దమ్మ కాబట్టే రాష్ట్ర ప్రజలు ఆయనను రెండుసార్లు ఓడించారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హైదరాబాదులో విమర్శించారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులను దద్దమ్మలు అన్న చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆయనను ప్రజలు అధికారానికి దూరంగా ఎందుకు ఉంచారో తెలుసుకోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సంయమనం పాటించాలని సూచించారు. ఆయన ఇలాగే మాట్లాడితే ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. సిబిఐ అంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+