హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారు: కొండ్రు మురళి

By Pratap
|
Google Oneindia TeluguNews

kondru Murali
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై ప్రభుత్వ విప్ కొండ్రు మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై వేటు వేయవద్దని వైయస్ జగన్ వర్గానికి చెందిన కొంత మది శాసనసభ్యులు కోరుతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెసులోకి తిరిగి వస్తామని కొంత మంది శాసనసభ్యులు తమను సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు. విప్ ధిక్కరించిన శానససభ్యులపై వేటు పడాలన్నదే తమ వాదన అని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు పడడంలో జాప్యం కావడానికి తాము కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడి అనర్హత వేటు వేసే విషయంలో తాము జాప్యం చేయిస్తున్నట్లు వస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు.

కొండ్రు మురళి ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో శనివారం మాట్లాడారు. శాసనసభ స్పీకర్ ముందు తాము అన్ని విషయాలు పెట్టామని ఆయన చెప్పారు. కొంత మంది శాసనసభ్యులు వేటు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. స్పీకర్ సమక్షంలోనే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని, చర్యలు తీసుకోవడానికి అది చాలునని ఆయన అన్నారు. వారందరిపై వేటు వేయాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. విప్ అందలేదని చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు. దానిపై తాము స్పీకర్‌కు వివరణ ఇస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసులోకి తిరిగి వస్తామని చెబుతున్నవారి పేర్లు బయట పెట్టడం నైతికత కాదని, వారు బయటకు రావాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.

English summary
Government whip Kondru Murali has said that few YS Jagan camp MLAs are in touch with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X