జూడాలకు చంద్రబాబు మద్దతు, ప్రభుత్వంపై ధ్వజం

Chandrababu Naidu
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. స్టయిఫండ్ పెంపు కోసం జూనియర్ డాక్టర్లు కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ డాక్టర్ల డిమాండ్లు సమంజసమైనవేనని ఆయన అన్నారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న జూడాల ఆందోళనకు ఆయన సమర్థించారు. ఎన్ని రకాలుగా ఉద్యమించినా డిమాండ్లు పరిష్కరించకపోవడం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు.

జూడాల డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మొండి వైఖరి వీడాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు జూనియర్ డాక్టర్లకు అండగా ఉంటామని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. వెంటనే చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతమవుతుందని ఆయన హెచ్చరించారు.

కాగా, గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న వారిలో రవి అనే వైద్యుడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతన్ని ఐసియుకు మార్చారు. ఆజాద్ అనే మరో వైద్యుడి ఆరోగ్యం కూడా క్షీణించింది. జూడాలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్సి బివి రాఘవులు కూడా మద్దతు తెలిపారు. ప్రజాసేవ చేస్తున్నారని చెబుతూ శాసనసభ్యులకు లక్ష రూపాయలు ఇస్తున్న వైద్యులను మాత్రం అంటరానివారిగా చూస్తోందని ఆయన విమర్శించారు. ఇదిలా వుంటే, జూనియర్ డాక్టర్లను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+