రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ విగ్రహాల వల్లే విధ్వంసాలు, రీజెన్సీపై విచారణ: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
రాజమండ్రి: రాష్ట్రంలోని అనుమతిలేని విగ్రహాల కారణంగానే విధ్వంసాలు జరుగుతున్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు రాజమండ్రిలో సోమవారం అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం బాధాకరమన్నారు. యానాంలోని రీజెన్సీ ఘటనపై సిబిఐ విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. రీజెన్సీ సంఘటనకు అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనపై హర్ష కుమార్ కూడా సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్మికులు నష్ట పోకుండా ఉండేందుకు మిల్లును వెంటనే తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మిల్లు తెరిపించకపోతే కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు యాజమాన్యానికి మద్దతు పలికినట్లుగా ఉందని, కార్మికులకు అండగా ఉన్నట్లుగా లేదని విమర్శించారు. ఆయన యాజమాన్యానికి కొమ్ముకాయడం దారుణమన్నారు.

రీజెన్సీ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ హర్ష కుమార్ చెప్పారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ వేయించాలనేదే తన డిమాండ్ కూడా అన్నారు. తన పాత్రతో పాటు, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మృతిపై కూడా సిబిఐ విచారణ జరిపించాలన్నారు. కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. వారికి న్యాయం చేసే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

English summary
Congress senior leader V Hanumanth Rao said that MP Harsha Kumar has no link with regency issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X