వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేధించ లేదు: విజయమ్మ వ్యాఖ్యలపై జెసి, శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy-Sailajanath
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సిబిఐ దర్యాఫ్తు జరుగుతోందన్న ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యలను మంత్రి శైలజానాథ్ మంగళవారం తప్పు పట్టారు. సిబిఐ కాంగ్రెసుకు అనుకూలంగా పని చేస్తుందని భావిస్తే కాంగ్రెసు నేతలు కూడా జైలుకు వెళ్లారు కదా అని ప్రశ్నించారు. కాంగ్రెసుకే అనుకూలమైతే మా నేతలు ఎలా జైలుకెళ్లారన్నారు. గతంలో దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంధ్ర హత్య కేసులో జగన్ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సిబిఐ విచారణ వేయించారని గుర్తు చేశారు.

అప్పుడు సిబిఐ జగన్‌ను నిర్దోషిగా తేల్చిందన్నారు. అప్పుడు వారికి అనుకూలంగా వచ్చిందన్నారు. ఇప్పుడు కేసు వారికి అనుకూలంగా లేదని ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శమని ఆరోపించారు. విజయమ్మ ఆరోపణలను మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కూడా వేరుగా ఖండించారు. జగన్ లక్ష్యంగా విచారణ సాగితే విజయమ్మ ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. వైయస్ కుటుంబాన్ని ఎవరూ వేధించలేదన్నారు. అనాటి మంత్రులు తప్పు చేస్తే శిక్షించాల్సిందేనన్నారు. మంత్రులపై విజయమ్మ ఆధారాలు చూపించాలన్నారు. కాగా సిబిఐ దర్యాఫ్తు తన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని జరుగుతోందని వైయస్ విజయమ్మ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు సుదీర్ఘ లేఖ రాసిన విషయం తెలిసిందే.

English summary
Minister Sailajanath and JC Diwakar Reddy condemned Puluvedula MLA YS Vijayamma comments against Congress and CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X