హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకన్న సాక్షిగా తప్పు చేయలేదు: ఎల్వీ సుబ్రహ్మణ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

LV Subramanyam
హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణం విషయంలో తనపై ఆరోపణలు రావడం పట్ల ఐఎఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇవో) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్న సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని ఆయన బుధవారం అన్నారు. ఎమ్మార్ కుంభకోణం కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎల్వీ సుబ్రహ్మణ్యం పేరును నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దానిపై ఆయన స్పందించారు. తాను తప్పు చేసి ఉంటే అలిపిరి దాటి ఉండేవాడ్ని కానని ఆయన అన్నారు. ఎమ్మార్ కుంభకోణంలో తన తప్పు లేదని ఆయన అన్నారు.

పని ఒత్తిడిలో ఏమైనా తప్పులు దొర్లి ఉండవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనే ఆతురుత వల్ల తప్పు జరిగి ఉండవచ్చునని ఆయన అన్నారు. తెలియక తప్పులు దొర్లుతాయని, అది మానన సహజమని ఆయన అన్నారు. తప్పుల వల్ల లాభమేమైనా జరిగిందా అనేది చూడాల్సి ఉంటుందని, దాన్ని దర్యాప్తు చూసి ఉంటుందా అనేది తనకు తెలియదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసినప్పుడు సమస్యలు రావచ్చునని, అది భగవంతుడు పెట్టే పరీక్ష అని ఆయన అన్నారు. తానేమీ భయపడడం లేదని ఆయన అన్నారు. ఎమ్మార్ కుంభకోణంలో తనకు గడ్డిపోచ లాభం కూడా జరగలేదని, తాను ఒక్క పైసా తీసుకోలేదని ఆయన అన్నారు.

కాగా, గుండెనొప్పితో నిమ్స్‌లో చేరిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య కోలుకున్నారు. ఆచార్యను సిబిఐ అధికారులు ఎప్పుడైనా తీసుకుని వెళ్లవచ్చునని నిమ్స్ అధికారి అనురాధ చెప్పారు. ఆచార్య ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఆచార్యకు అన్ని పరీక్షలూ నిర్వహించామని అనురాధ చెప్పారు.

English summary
IAS officer, TTD EO LV Subramanyam said that he is innocent in EMAAR scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X