వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నానావతి ఎదుట హాజరీపై హైకోర్టులో మోడికి ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి బుధవారం ఊరట లభించింది. 2002లో గోద్రా దుర్ఘటనపై నరేంద్ర మోడీ జస్టిస్ నానావతి కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని గుజరాత్ అత్యున్నత న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. 2002 గోద్రా సంఘటనపై మోడికి నోటీసులు ఇవ్వాలని కోరుతు జన సంఘర్షణ మంచ్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. మోడీ కమిషన్ ఎదుట హాజరు కావాలన్న పిటిషన్‌ను గతంలోనే కమిషన్ తోసిపుచ్చింది. అయితే మోడీ నానావతి ఎదుట హాజరు కావడాన్ని తిరస్కరించడంతో జన సంఘర్షణ మంచ్ హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టులో వారికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుపై స్పందించిన జన సంఘర్షణ మంచ్ తాము ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా 2002లో గోద్రా దుర్ఘటనపై జస్టిస్ నానావతి కమిషన్ దర్యాఫ్తు చేస్తోంది.

English summary
In a big relief to Chief Minister Narendra Modi, the Gujarat High Court ruled on Wednesday that he would not have to depose before Justice Nanavati-Mehta Commission probing the 2002 post-Godhra riots case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X