వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ దర్యాప్తు: వైయస్ జగన్ ఆస్తుల కేసుపై ఫోకస్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ కుంభకోణం కేసుల విచారణ ఓ దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో సిబిఐ వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. తొలి రెండు కేసుల్లో సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇక వైయస్ జగన్ ఆస్తుల కేసుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఓ కొలిక్కి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటి వరకు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని మాత్రమే ఆరెస్టు చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన ఐఎఎస్ అధికారులతో పాటు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులను సిబిఐ విచారిస్తోంది. ఇందులో సిబిఐ అత్యంత వేగంగా కదులుతున్నట్లు గురువారంనాటి విచారణలను బట్టి చూస్తే అర్థమవుతోంది.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి గురువారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. సాధారణ పరిపాలనా విభాగంలో పొలిటికల్ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ మిశ్రాను కూడా సిబిఐ గురువారం ప్రశ్నించింది. అజయ్ మిశ్రా వైయస్ హయాంలో మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శిగా, హోం శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గ్రామీణ నీటి పారుదల శాఖలో ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు.

సాక్షి దినపత్రికను ప్రచురిస్తున్న వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు సజ్జల రామకృష్ణా రెడ్డి, సత్యమహేశ్వరిలను కూడా సిబిఐ గురువారం ప్రశ్నించింది. వీరితో పాటు ఇఁడియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, విజయలక్ష్మి మినరల్స్ ప్రతినిధులు కూడా సిబిఐ ముందు హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గనుల వ్యాపారి శశికుమార్‌ను సిబిఐ గురువారం ప్రశ్నించింది.

English summary
It seems that, CBI has intensified its probe into YSR Congress party president YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X