వైయస్ జగన్ గురించి సిబిఐ అడగలేదు: రమాకాంత్ రెడ్డి

మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు జరిగాయా, లేదా అని అడిగారని, మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జీవోలు విడుదల చేశారా, జీవోల జారీలో ఎవరి ఒత్తిడైనా పనిచేసిందా అని అడిగారని, మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే జీవోలు జారీ అయ్యాయని తాను చెప్పానని ఆయన వివరించారు. భూముల కేటాయింపుల్లో ఏ విధమైన అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ విచారణకు రావాలని సిబిఐ అధికారులు తనను అడగలేదని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి సంతకాలతోనే పలు జీవోలు జారీ అయ్యాయి. దీంతో సిబిఐ ఆయనను విచారించింది.












Click it and Unblock the Notifications