రాష్ట్రం అట్టుడుకుతోంది: టిటిడిపై చిన జీయర్ ధ్వజం

శ్రీవారికి రెండు గంటల విరామం ఉండాలన్నారు. రాత్రి పది గంటల తర్వాత తలుపులు తెరిచి ఉంటే శ్రీవారికి నిద్రాభంగం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని టిటిడి విస్మరించిందన్నారు. కల్యాణోత్సవాలు బయట నిర్వహించడం తగదన్నారు. తిరుమలలో ఉపద్రవాలు మొదలయ్యాక రాష్ట్రం అట్టుడుకుతోందన్నారు. ఆర్థిక పృష్టి కూడా శ్రీవారికి శాపమైందని, దేవుడి సేవకులుగా ఆయన వద్దకు ఎవరైనా వేళ్లాలని, విలాసాల కోసం కాదన్నారు. తిరుమలలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు ఎందుకన్నారు. కాగా చిన జీయర్ స్వామికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తిరుమల తిరుపతి పరిరక్షణా సమితి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications