టిడిపి ఎమ్మెల్సీ నర్సా రెడ్డికి సుప్రీంలోనూ చుక్కెదురు

అయితే, వెంకట్రామి రెడ్డి ఆ ఎన్నికపై కోర్టుకు ఎక్కారు. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అయితే, కేసును హైకోర్టులోనే పరిష్కరించాలని, అవసరమైతే హైకోర్టు సమక్షంలో ఓట్ల లెక్కింపును తిరిగి చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో కేసుపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు హైకోర్టు సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తిరిగి జరిగింది. ఈ రీకౌంటింగ్‌లో నర్సా రెడ్డి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయిట్లు తేలింది. దీనిపై నర్సా రెడ్డి మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. అక్కడా అయనకు చుక్కెదురైంది. అయితే తాను హైకోర్టులోనే తేల్చుకుంటానని ఆయన చెబుతున్నారు. కాగా నర్సా రెడ్డికి చుక్కెదురు కావడం ఆయనకు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీకి కూడా ఎదురు దెబ్బనే.












Click it and Unblock the Notifications