జగన్ సాక్షిపై పరువు నష్టం దావా వేస్తా: శివరామ

కాగా అంతకుముందు రోజు ఆయన అదే పత్రిక తీరుపై మండిపడ్డ విషయం తెలిసిందే. తాను దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరినట్లు నిరూపిస్తే కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఉరేసుకుంటానని ఆయన సవాల్ చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసును పక్కదారి పట్టించేందుకే తనపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. విల్లాలు కొనుగోలు చేసినవారిని విచారిస్తే ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో ఎవరి పాత్ర ఉందనేది బయటపడుతుందని ఆయన అన్నారు. తాను గానీ, ఎపిఐఐసి మాజీ మైనేజింగ్ డైరెక్టర్ గానీ దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరామని చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. తాము దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరినట్లు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు చెందిన విజయ రాఘవన్ తదితరులు చెప్పినట్లు అఫిడవిట్ దాఖలైందని వార్తలు వచ్చాయని, ఆ వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. తమపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపసంహరించుకోకపోతే వాటిని రుజువు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications