నా ప్రమోషన్ ఆపేశారు, ఇతరులదేం చెప్పాలి: స్వామి గౌడ్

తెలంగాణ ఉద్యోగుల ఆందోళనా కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. మార్చి 3వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. మార్చి 5వ తేదీన హైదరాబాదులో ధర్నా ఉంటుందని ఆయన చెప్పారు. మార్చి 20వ తేదీన చలో హైదరాబాదు కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి భోజన విరామ సమయాల్లో నిరసన ప్రదర్శనలుంటాయని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వర్క్ టూ రూల్ పాటిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన పాపానికి ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన అన్నారు. ప్రధాని సహా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకే తాము ఆ రోజు 42 రోజుల సకల జనుల సమ్మెను విరమించామని ఆయన అన్నారు. ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. అనివార్యమైన స్థితిలోనే తాము సమ్మె నోటీసు ఇచ్చామని ఆయన చెప్పారు.
తొమ్మిది డిమాండ్లతో నోటీసు ఇచ్చినట్లు దేవిప్రసాద్ చెప్పారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. సమ్మె కాలంలో 20 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని, వారికి పదవీవిరమణ పత్రాలు ఇవ్వడం లేదని, పదవీవిరమణ ప్రయోజనాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దాన్ని కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి మరో నేత శ్రీనివాస గౌడ్ కూడా మాట్లాడారు.












Click it and Unblock the Notifications