ప్రత్యేక కెటగిరీ ఖైదీగా బిపి ఆచార్య: కోర్టు ఆదేశం

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను స్పెషల్ కెటగిరీ ఖైదీగా గుర్తిస్తూ హైదరాబాదులోని నాంపల్లి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు కొంత ఊరట లభించింది. దీనివల్ల ఆచార్యకు హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ప్రత్యేక వసతులు ఒనగూరుతాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ఆచార్య ప్రధాన నిందితుడు. అరెస్టయిన తర్వాత ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

ఎమ్మార్ అక్రమాల కేసులో ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యను సిబిఐ అధికారులు జనవరి 30వ తేదీన అరెస్టు చేశారు. ఆయనపై పలు సెక్షన్ల క్రింద సిబిఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, అకౌంట్లు తారుమారు చేశారనే పలు అభియోగాలు మోపింది. ఎమ్మార్ ఒప్పందంలో ఏపిఐఐసి వాటా తగ్గినా ప్రేక్షక పాత్ర వహించారని ఎఫ్ఐఆర్‌లో సిబిఐ ఆరోపించింది. ప్రభుత్వ వాటా తగ్గడంలో ఆయనదే కీలక పాత్ర అని, మిత్రులకు, సహచరులకు విల్లాలు కేటాయించడంలో సూత్రదారి అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+