తెలంగాణ నినాదాలతో జెట్ స్పీడ్‌తో గవర్నర్ ప్రసంగం

Narasimhan
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ సోమవారం అసెంబ్లీలో జెట్ స్పీడ్‌తో తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలు జాతీయ గీతంతో ప్రారంభమయ్యాయి. అనంతరం గవర్నర్ ఉబయ సభలనుద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. అయితే విపక్షాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు నినాదాలు చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను ఎమ్మెల్యేలు చించి గవర్నర్ వైపు విసిరారు. తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలేందుకు ప్రయత్నించారు. దీంతో గవర్నర్ తన ప్రసంగాన్ని జెట్ స్పీడ్‌తో చదవడం ప్రారంభించారు. హడావుడిగా గవర్నర్ ప్రసంగం చదవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాసేపటికి విపక్షాల నినాదాలు చల్లబడటంతో ఆయన తన ప్రసంగంలో వేగం తగ్గించి చదివారు. కాగా గత సంవత్సరం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన ఘటన దృష్ట్యా గవర్నర్ తన ప్రసంగంలో స్పీడ్ పెంచినట్లుగా కనిపిస్తోంది.

బలహీనవర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో చేసిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వామపక్ష తీవ్రవాదం ఎదుర్కొనేందుకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో 2వేల కిలోమీటర్ల రహదారిని హైవేగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కృష్ణా, గోదావరి నీటిని హైదరాబాద్ తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రాజకీయ, మతపరమైన హింసలు అదుపులో ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+