హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సిఎం చేతులు దులుపుకోవద్దు: హరీష్‌రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ అంశం ఢిల్లీ పరిధిలో ఉందని చెప్పి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతులు దులుపుకోవడం సరికాదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు సోమవారం అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు సోమవారం గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా వారి మాట్లాడారు. వచ్చే శుక్రవారం తాము అసెంబ్లీలో తెలంగాణపై ప్రైవేట్ తీర్మానం ప్రవేశ పెడతామని అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెసు వైఖరి బయట పడుతుందన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలపై కాకుండా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే కేంద్రంపై ఒత్తిడి పెంచినట్లవుతుందని సూచించారు. తెలంగాణపై ప్రభుత్వం మాట తప్పితే ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై ఒత్తిడి తీసుకు రావాలని కానీ అలా కాకుండా తెలంగాణను అడ్డుకునేందుకు టిడిపి, కాంగ్రెసులు ఒక్కటై పోయాయని ఆరోపించారు. అసెంబ్లీలో రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావిస్తామన్నారు.

కాంగ్రెసు తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినందున గవర్నర్ ప్రసంగంలో ఆ అంశం ఉండాల్సిందేనని మరో నేత పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేకుంటే బహిష్కరిస్తామని చెప్పారు. మా తెలంగాణ మేం పోరాడి సాధించుకుంటామన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం తీర్మానం ప్రవేశ పెట్టాలన్నారు. 2009 ఎన్నికల టిడిపి మేనిఫెస్టోలో తెలంగాణ ఉందని దానికి వారు కట్టుబడి ఉండాలన్నారు.

English summary
TRS MLA Harish Rao suggested CM Kiran Kumar Reddy about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X