చిరు ఎమ్మెల్యేలను కలుపరు, వారిని పంపరు: హరీష్

శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించకపోతే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను పాతరేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. శాసనసభ రేపటికి వాయిదా పడిన తర్వాత మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ కోసం తీర్మానం ప్రతిపాదించాలని అడిగితే సభను వాయిదా వేసుకుని పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తాము లేవనెత్తిన తెలంగాణ అంశంపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సభ్యులు నోరు విప్పడం లేదని ఆయన అన్నారు.
శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదిస్తే మద్దతిస్తామని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు హామీ ఇచ్చాయని, ఆ హామీని నిలబెట్టుకోలేదని తెరాస శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ తీర్మానాన్ని సభలో ప్రతిపాదించాలని మాత్రమే తాము కోరామని ఆయన అన్నారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని ప్రస్తావిస్తూ శాసనసభలో తీర్మానం చేసి పంపితే బంతి కేంద్రంలో పడుతుందని, అదే తాము అడుగుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications