ఘనంగా శివరాత్రి వేడుకలు, కిక్కిరిసిన దేవాలయాలు

శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట తదితర పుణ్యక్షేత్రాలకు భక్తులు తరలి వచ్చారు. కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భద్రాచలంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పుట్టపర్తిలో రుద్రాభిషేకం చేశారు. ఈ అభిషేకంలో మంత్రి గీతా రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు అన్ని శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 10 గంటలకు పాగాలంకరణ, రుద్రాభిషేకాలు, రాత్రి 12 గంటలకు భ్రమరాంభికా సమేత మల్లికార్డున స్వామి కళ్యాణోత్సవం ఉంటుంది. వేములవాడలో సాయంత్రం ఆరుగంటలకు సహస్ర లింగార్చన ఉంటుంది.
గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయంలో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ దేవాలయం కిటకిటలాడుతోంది. శ్రీకాళహస్తిలో ముక్కంటిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మెదక్ జిల్లా ఏడుపాయలు జాతరకు ముస్తాబైంది. ఈ జాతరకు సుమారు ఐదు నుండి ఏడు లక్షల మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి తరలి వస్తారు.












Click it and Unblock the Notifications