మా వాళ్ల చేతకానితనం: టిఆర్ఎస్‌పై మోత్కుపల్లితో జెసి

కాగా ఆ తర్వాత మోత్కుపల్లికి మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి తారసపడ్డారు. వెంటనే ఆయనతో మోత్కుపల్లి... టిఆర్ఎస్ పార్టీని సభ నుండి సస్పెండ్ చేయవచ్చు కదా అని అడిగారు. మీ పార్టీ టిఆర్ఎస్‌తో కుమ్మక్కు కావడం వల్లనే సస్పెండ్ చేయడం లేదని ఆరోపించారు. కెసిఆర్ పీడ విరగడ అయ్యేందుకు తాను చండీయాగం చేస్తానని చెప్పారు. యాగం విషయంలో మోత్కుపల్లికి మద్దతు తెలిపిన జెసి కుమ్మక్కు విషయంలో మాత్రం విభేదించారు. టిఆర్ఎస్‌తో కుమ్మక్కు అనవద్దని అది మా వాళ్ల చేతకానితమని చెప్పారు. మా వాళ్లు సస్పెండ్ చేసే ధైర్యం చేయలేక పోతున్నారన్నారు.












Click it and Unblock the Notifications