ఎన్నికలు వస్తే వైయస్ జగన్‌దే గెలుపు: సబ్బం హరి

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే కోవూరు ఉప ఎన్నికలో గెలవాలని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పార్టీ కన్వీనర్ నూకసాని బాలాజీతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications