హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై నిర్ణయం ఎప్పుడో చెప్పలేం!?: జెసి దివాకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తున్నట్టు తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయితే వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం మాత్రం సబబేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నిర్ణయం ఎప్పుడో చెప్పలేమని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పరిస్థితి బాగుంటుంది ఆయన అభిప్రాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాలలో పార్టీ అభ్యర్థులే గెలుస్తారనే ధీమాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని చెప్పారు.

కాగా తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మండలి, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే దిశలో ఆలోచిస్తుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణవాదులు మాత్రం తమకు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లు అవసరం లేదని తెలంగాణ రాష్ట్రమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయాలకు తాము ఆమోదించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు.

English summary
Congress Party senior leader JC Diwakar Reddy said that Telangana will take time by UP election and bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X