హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మార్ స్కామ్ కేసు, సిబిఐ కస్టడీకి శ్రీకాంత్ జోషీ

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ఎమ్మార్ ఎంజిఎఫ్ సిఇవో శ్రీకాంత్ జోషీని సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు శ్రీకాంత్ జోషీని సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. న్యాయవాది సమక్షంలోనే శ్రీకాంత్ జోషీని విచారించాలని కూడా సూచించింది.

శ్రీకాంత్ జోషి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు శ్రీకాంత్ జోషీని అరెస్టు చేయకూడదని కోర్టు సిబిఐని ఆదేశించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన విజయరాఘవ బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.

English summary
CBI Court ordered for CBI custody for Srikanth Joshi in EMAAR properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X